![]() |
![]() |
.webp)
కాకమ్మ కథలు న్యూ ప్రోమో రిలీజ్ ఐపోయింది. ఈ న్యూ ఎపిసోడ్ కి యాంకర్ రవి, తేజస్విని గౌడ వచ్చారు. ఇక ఈ షోలో తేజస్విని గౌడ డివోర్స్ విషయం మీద కొన్ని విషయాలు నడిచాయి. "తేజు బిగ్ బాస్ కి వెళ్తోందా" అని హోస్ట్ అడిగేసరికి ఒక్కసారి ఊపిరి బిగబట్టి కూర్చుంది తేజు. "మీరు అమర్ తో డివోర్స్ తీసుకుంటున్నారా" అని మళ్ళీ హోస్ట్ అడిగింది. "రీసెంట్ టైమ్స్ లో కొన్ని సిట్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు అనిపించింది ఈ సందర్భంలో డాడీ ఉండి ఉంటే..అదొక్కటే నేను డాడీని నా లైఫ్ లో మిస్ ఐన టైం అంతే" అనే ఎమోషనల్ అయ్యేసరికి హోస్ట్ వెళ్లి ఆమెను ఓదార్చింది. తరువాత యాంకర్ రవిని అడిగింది హోస్ట్ " మీరు కెరీర్ లో తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ ఏమిటి" అనేసరికి "కొంతమంది చెప్పారు ఎంత చెప్పినా నాకు ఎక్కలేదు. దాంతో కొన్ని రాంగ్ షోస్ చేసాను. ఐతే తేజస్విని గౌడ విషయంలో ఇష్మార్ట్ జోడిలో అమరదీప్ తేజు డివోర్స్ విషయం మీద కొన్ని విషయాలు తెలిసాక సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కూడా జరిగింది.
కానీ ప్రతీ ఒక్కరి మ్యారీడ్ లైఫ్ ఇలాంటి కొన్ని పరిస్థితులు వస్తాయి కానీ దానికే డివోర్స్ తీసుకోవాలా...కాదు సర్దుకుపోవాలి అని కూడా చెప్పింది. తర్వాత హోస్ట్ ఒక ప్రశ్న వేసింది "యాంకరింగ్ తక్కువ యాక్టింగ్ ఎక్కువ అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది" అని అడిగేసరికి "తేజు" అని ఆన్సర్ ఇచ్చాడు రవి. తేజస్విని మడివాడ యాంకరింగ్ కంటే యాక్టింగ్ అలాగే ఫన్ ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇందులో కొన్ని పదాలు ఇచ్చి వాటితో స్టోరీ అల్లమని చెప్పింది..అందులో మంచు అనే పదం వచ్చేసరికి "ఇప్పుడు మంచు లక్ష్మి అక్క వస్తుంది ఓకే నా" అని అడిగాడు. "ప్లీజ్ కథ మధ్యలోకి అక్కను తీసుకురావద్దు" అని తెగ పగలబడి నవ్వుతూ చెప్పింది హోస్ట్ తేజు. ఇక తేజస్విని-అమరదీప్ ప్రతీ షోలో కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు కనిపించని షో అంటూ ఏదీ ఉండదు.
![]() |
![]() |